
అలాగే వైసిపి నేతలు గతంలో వ్యక్తిత్వహనానానికి పాల్పడిన తాము ఆ తరహా రాజకీయాలు చేయమన్న చంద్రబాబు దాన్ని తన చేతల్లో చేసి చూపిస్తున్నారు .. వైసిపి అధినేత వైఎస్ జగన్ భార్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టిడిపి ప్రకటించింది . జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్ష లీడర్లను విమర్శించేందుకు వైసిపి నాయకులు కార్యకర్తలు హద్దులు మీరి మరి ప్రవర్తించారు .. అలాగే ప్రతి విషయంలోకి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి నీచంగా మాట్లాడారు . ఇలాంటి సంఘటనలు చూసిన టిడిపి కార్యకర్తలకు రక్తం మెరిగిపోయింది అధికారంలోకి వచ్చాక చూపిద్దామని ఐదేళ్లు ఓపిగ్గా ఉన్నారు .
తమ నేతల కుటుంబ సభ్యులపై అసహ్యంగా మాట్లాడితే తాము ఎందుకు ఊరుకోవాలని కోపంతో వారిపై ఎదురుదాడి మొదలుపెట్టారు . అలాగే ఇలాంటి ప్రతీకార కక్షపూరిత రాజకీయాలను ఎంకరేజ్ చేయబోమని అధికారులోకి వచ్చాక చంద్రబాబు క్లియర్ గా చెప్పేశారు. అలాగే జగన్ భార్యపై టిడిపి నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ కిరణ్ ను పార్టీ నుంచి తప్పించారు .. అలాగే ఎవరైనా హుందాగా మాట్లాడాలని లేదంటే వేటు తప్పదని క్లారిటీగా సంకేతాలు ఇచ్చేశారు .. అలాగే ఈ కలుషితమైన రాజకీయాలను చక్కబెడుతున్న చంద్రబాబుకు ఇప్పుడు వైసీపీ కూడా హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.