ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సి నోటిఫికేషన్ విడుదలయి ఆరేళ్లు అవుతుంది.. గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయ నిరుద్యోగులను నిండా ముంచింది.. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డీఎస్సి పై మొదటి సంతకం చేసింది.. 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.. మొదటి సంతకం పెట్టి సంవత్సరం కాబోతుంది.. కానీ ఇంత వరకు నెరవేర్చ లేదు.. దీనితో నిరుద్యోగులు భగ్గు మన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడానికి సిద్ధం అయ్యారు.. తాజాగా డివైఎఫ్ఐ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బిర్లా కాంపౌండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ అధ్యక్షత వహించారు..

 కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం పెట్టి మొదటికే డీఎస్సీ అభ్యర్థులని మోసం చేశారని ఆరోపించారు. పది నెలలు గడిచిన మొదటి సంతకాన్ని అమలు చేసే దిక్కు లేదని ఇలాంటప్పుడు వారంలో మెగా డీఎస్సీ అని ముఖ్యమంత్రి, త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికి పదిసార్లు ప్రకటన చేసి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని తెలిపారు. అందుకే ఈరోజు కర్నూలు జిల్లాలోని డీఎస్సీ అభ్యర్థులందరూ.. మొదటి సంతకం.. మొదటికే మోసం అంటూ నినాదాలు చేసారు.. వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయాలని, జిల్లా మొత్తం అభ్యర్థులందరికీ ఒకే పేపర్ ఉండేలాగా పరీక్షలు నిర్వహించాలని, రోజుకో మాట చెప్పి నిరుద్యోగులను మోసం చేయొద్దని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు..

వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.  రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసిన పట్టించుకోకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్కడికి వెళితే అక్కడే ఆందోళనకు దిగవలసి వస్తుందని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

DSC