
అధికార టిడిపి, ఐ టీడీపీ పేరిట సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో కూడా వైరల్ గా మారుతుంటాయి. అలాగే జనసేన వైసిపి వారికి కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకమైన చానల్స్ తో పాటు కొన్ని అకౌంట్స్ కూడా ఉన్నాయి. ఇటీవల ఐ టీడీపీకి చెందిన ఒక కార్యకర్త కిరణ్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కిరణ్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు.
చాలా కార్యక్రమాల ద్వారా వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం టిడిపికి సపోర్టుగా నిలిచేవారు. వైయస్ భారతీయుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అటు వైసిపి కార్యకర్తలను చిర్రెత్తించేలా చేసింది. ఈ వ్యాఖ్యలకు కిరణ్ ఏకంగా క్షమాపణలు చెబుతూ ఒక వీడియోని విడుదల చేయడమే కాకుండా జగన్, భారతి కాళ్లు కూడా పట్టుకొని క్షమాపణలు చెబుతాను అంటూ వీడియోని విడుదల చేశారు.అయినప్పటికీ కూడా ఐటీడీపీ కార్యకర్త కావడం చేత టిడిపి అధిష్టానం ఫైర్ అయ్యి మహిళల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని సస్పెండ్ చేయాలని అతని పైన పోలీస్ కేసు కూడా పెట్టించినట్లు తెలుస్తోంది. దీంతో ఐటీడీపీ పైన చాలామంది నేతలు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలను పెట్టాల్సిన అవసరం ఏముంది ఇలాంటి వాటివల్ల చెడ్డ పేరు వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారట.