
కాగా.. 'మా సైనికులు అంటూ ఎవరూ ఉక్రెయిన్ యుద్ధంలో లేరు.. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి!' అంటూ జెలెన్ స్కీ ఆరోపణల్ని బీజింగ్ తోసిపుచ్చింది. ఈ సందర్భంగా చేసిన ప్రకటనలో బీజింగ్... "సాయుధ పోరాటాలు జరుగుతున్న చోటునుండి అందరూ దూరంగా ఉండాలి.. అని మేమే మా పౌరులకు శిక్షణలో భాగంగా చెబుతాం. అలాంటి మామీద ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధంలో మేము ఇప్పటికీ తటస్తంగానే వ్యవహరిస్తున్నాం. మా మద్దతు ఎవరికీ ఉండదు... ఉండబోదు!" అని రాసుకొచ్చింది.
ఇకపోతే సుమారు 3 సంవత్సరాల రష్యా దండయాత్ర మధ్య ఉక్రెయిన్ తన గడ్డపై చైనా యోధుల గురించి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అంతేకాకుండా, ఉక్రెయిన్ సంక్షోభాన్ని రాజకీయంగా పరిష్కరించడంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ బీజింగ్‌లో అన్నారు. ఈ సందర్భంగా లిన్ మాట్లాడుతూ... "చైనా ప్రభుత్వం ఎల్లప్పుడూ చైనా పౌరులను సంఘర్షణలకు దూరంగా ఉండాలని, ఏ విధమైన సాయుధ పోరాటంలోనూ పాల్గొనకుండా ఉండేందుకు నిరంతరం ప్రయత్నించాలని చెబుతూ ఉంటుంది." అని చెప్పుకొచ్చారు. ఇక సరిహద్దు వివాదం, ద్వైపాక్షిక సంబంధాలపై బీజింగ్‌లో భారత్, చైనా దౌత్య చర్చలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు చైనా బంగ్లాదేశ్ తో సంబంధాలను మరింతగా పెంచుకుంది. రుణ చెల్లింపు, సుంకం రహిత యాక్సెస్‌ను పొడిగించింది.