కాంగ్రెస్ దశాబ్దాల కాలం నుంచి దేశాన్ని పాలించిన పార్టీ. అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడైనా  గాంధీ కుటుంబీకులే బిగ్ బాస్ గా ఉంటుంటారు. ఇంకెవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైతె గాంధీ కుటుంబ సభ్యులు చెప్పినట్టే ఆ వ్యక్తి ఉండాలి. ఈ పార్టీ పాలించిన పిరియడ్ లో ఎక్కువ కాలం వారి కుటుంబం నుంచే ప్రధానులయ్యారు. ఒకవేళ వేరే వ్యక్తులు ప్రధానులైతే  గాంధీ కుటుంబీకులు ఏది చెప్తే అది చేయాల్సిందే.. ఆ విధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున కార్గేను  నియమించారు. కానీ ఆయన చెప్పిన ఏ విషయం కూడా పార్టీలో సాగదు. మళ్లీ నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీ మాత్రమే తీసుకోవాలి. 

అలాంటి ఈ తరుణంలో తాజాగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జునకు ఘోర అవమానం జరిగింది. అలహాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దళిత నాయకుడు అయినటువంటి మల్లికార్జున కర్గేకు  సపరేట్ చేరువేశారు. సోఫాలో కూర్చొనివ్వలేదు. ఈ విషయాన్ని బిజెపి పార్టీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియా బయటపెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. పార్టీ దేశంలో దళితులను గౌరవిస్తుందని చెప్పడం కాదు  మొదట మీ మల్లికార్జున కార్గేను  గౌరవించడం నేర్చుకోండి అంటూ  క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు తన కుర్చీని పక్కన పెట్టడం ఏంటి? దీన్ని బట్టి కాంగ్రెస్ కు దళితుల పట్ల ఎలాంటి వైఖరి ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. 

మరోసారి కాంగ్రెస్  దళిత వ్యతిరేక రాజకీయాలు చేస్తోందని దీన్నిబట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు అన్నారు. అయితే ఈ విషయం దళిత వ్యతిరేకం కాకపోవచ్చు కానీ కాంగ్రెస్ లో గాంధీ కుటుంబానికి ఉన్నంత మర్యాద ఇతర ఏ నాయకుడికి ఉండదు. తాజాగా మల్లికార్జున కార్గే విషయంలో కూడా అదే జరిగిందని కానీ ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత లేదని తెలుస్తోంది.అంతేకాదు ఒక దళిత జాతికి చెందిన అధ్యక్షున్ని అలా అవమానించడంతో దళిత జాతికి సంబంధించిన ప్రజలు భగ్గుమంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: