ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ మాత్రం పనికిరాడు అంటూ చెప్పకనే చెప్పారు కవిత. దురదృష్టవశాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కు అవకాశం వచ్చిందని ఆమె చురకలాంటించారు. తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... దేశ రాజకీయాలు అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... తనకు నచ్చినట్లు  మాటలు మార్చుతున్నాడని... ఆమె మండిపడ్డారు. నరం లేని నాలుక.. అన్న తరహాలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో..? తెలియని పరిస్థితి ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాష విషయంలో... గతంలో ఒకలా ఇప్పుడు మరొక ల వ్యవహరిస్తున్నాడని.. ఫైర్ అయ్యారు. మొదట్లో కమ్యూనిస్టు భావాలతో మెదిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిజెపి వాదిగా మారిపోయాడని నిప్పులు జరిగారు.


 అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా ముందుకు సాగుతున్నారని ఆమె కొనియాడారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో.. ఎలాంటి ఎత్తు పల్లాలు వచ్చినా కూడా... జగన్ వెనుక అడుగు వేయడం లేదన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి  2.0 అద్భుతంగా ఉందని తెలిపారు.

 ఇక తనకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరంటే టక్కున కల్వకుంట చంద్రశేఖర రావు పేరు మాత్రమే చెప్పారు కల్వకుంట్ల కవిత. తనకు కేసీఆర్ అంటే ప్రాణం అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ మంచి లీడర్ అని వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు సచిన్ పైలెట్ కూడా డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి  నారా లోకేష్... అద్భుతంగా ముందుకు సాగుతున్నాడని కూడా కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: