
ఇలాంటి సందర్భంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు కావడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే వైయస్ భారతి పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినటువంటి కిరణ్ కుమార్ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసుల సైతం అరెస్టు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కిరణ్ కుమారుని సైతం మంగళగిరి నుంచి గుంటూరు కి తరలిస్తూ ఉండగా గోరంట్ల మాధవ్ పోలీస్ వాహనాన్ని సైతం వెంబడించినట్లు తెలియజేస్తున్నారు. కిరణ్ అంతు చూస్తానంటూ బెదిరించడంతో తమ విధులకు అడ్డుగా వస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవుని సైతం అరెస్టు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటికి చాలామంది వైసిపి నేతలతో పాటు కార్యకర్తలు కూడా ఐటీడీపీ ప్యాక్ అయినటువంటి కిరణ్ కుమార్ పైన కూడా చాలా కోపంగా ఉన్నారు. టిడిపి కూడా కిరణ్ కుమార్ ని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పలు రకాల యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వైసిపి పార్టీని జగన్మోహన్ రెడ్డిని కూడా పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ రాజకీయాలలో ఇవి సర్వసాధారణం అనుకున్నారు. కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్యని అనడంతో ఒక్కసారిగా రాజకీయాల హీటెక్కడంతో టీడీపీలోను చాలామంది నేతలు కూడా ఆడవారిని రాజకీయాలలోకి లాగకూడదని ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదంటూ టిడిపి అధిష్టానాన్ని కూడా హెచ్చరిస్తున్నారట.