వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం తాజాగా జగన్ 2.O అడ్డు మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రతి చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడో అంతే వేగంగా పైకి లేస్తుందని.. ప్రజలు మంచి చేయడమే ప్రజాస్వామ్యం అధికారం ఉంది కదా అంటూ దుర్వినియోగం చేస్తే ప్రజలే కచ్చితంగా తిప్పి కొడతారని వచ్చే ఎన్నికలలో టిడిపికి సింగల్ డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఏర్పడుతుందంటూ హెచ్చరించారు. ఇటీవలే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసిపి నేతలతో సమావేశమైన జగన్ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది.


ఏపీ, తమిళనాడు ఎన్నికలలో ప్రజలు వన్ సైడ్ గా ఇచ్చిన తీర్పులను మనం చూసాము.. చంద్రబాబు భయపెట్టి ప్రయత్నాలు చేస్తున్నారని మనం అప్రమత్తంగా ఉండాలని రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలలో 10కి 9చోట్ల గెలిచాము.. మరి అక్కడ గెలవాల్సింది కూడా వైసీపీ పార్టీని అక్కడ ఎన్నికలను తారుమారు చేయడానికి ప్రయత్నించారంటూ మాట్లాడారు. కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు చేశారని ఫైర్ అయ్యారు.


రామగిరి ఎస్సై ఎంపిటిసిల వాహనమేక్కారు వీడియో కాల్ లో కూడా ఎమ్మెల్యేతో ఎమ్మెల్యే కుమారులతో మాట్లాడించి బెదిరించేలా చేశారు. టిడిపికి అనుకూలంగా ఓటు వేయాలని వైసీపీ పార్టీ ఎంపీటీసీలు ఎన్నిక సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. వేరే మండలానికి తీసుకువెళ్లి మరి వారిని రానివ్వకుండా చేసే కార్యక్రమం చేపట్టారని దీనికి వ్యతిరేకంగా ధర్నా చేస్తేనే.. మన పార్టీ నేతలు అధ్యక్షులు ఇన్చార్జిల మీద కూడా కేసులు పెట్టారని దీని తర్వాతే పార్టీలో యాక్టివ్ గా ఉన్న లింగమయ్యను హత్య చేయించారని.. ఇలా చేయాల్సిన అవసరం ఏముంది?ప్రజలకు మంచి చేస్తానని చెప్పి ఆరోజు ఏవేవో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హామీలను నెరవేర్చకుండా దిగజారిపోతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆ ప్రజాస్వామికంగా కూటమి వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. వైసిపి కార్యకర్తలు అంటే చంద్రబాబుకు భయమని కూడా విమర్శించారు. ఇక టిడిపి క్యాడర్ నాయకులు సైతం ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి కనిపించలేదు రాబోయే రోజుల్లో ప్రజలే నిలదీస్తారని కూడా తెలిపారు. ఈసారి కచ్చితంగా జగన్ 2.O పాలన ఎలా ఉంటుందో మీరే చూస్తారు.. అంటూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: