
తప్పు చేసిన పోలీసులను బట్టలుడదీసి నిలబెడతామని జగన్ మాట్లాడిన మాటలపై టిడిపి తో పాటు మరికొన్ని రాజకీయ పక్షాలు, పోలీసులకు సంబంధించిన సంఘాలు తప్పు పట్టాయి. రాష్ట్ర మంత్రులు కేవలం కొందరు మాత్రమే రియాక్ట్ అవ్వగా మరి కొంతమంది సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతిపక్ష నేతలు అన్న మాటకి క్యాబినెట్ మొత్తం కూడా ఆయన మీద ఫైర్ కావాల్సి ఉంటుంది. కానీ అలాంటిది ఇప్పుడు ఎక్కడ జరగడం లేదు. సీనియర్స్ కూడా చాలామంది కామ్ గానే ఉన్నారు. అయితే మౌనం వెనుక కొన్ని అర్థాలు దాగి ఉన్నాయని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఇప్పుడు ఏదో నోరు ఉందని మాట్లాడితే తరువాత ఇతర అవకాశాలు వచ్చినప్పుడు సమస్యలు ఎదురవుతాయని సీనియర్ మినిస్టర్స్ లలో పెద్ద ఆలోచన మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది అందుకే ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదని.. ప్రజలకు కోపం వస్తే ఎలాంటి పార్టీ అయినా సరే అణిచివేస్తారు అందుకు ఉదాహరణ గత వైసిపి ప్రభుత్వం ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని సీనియర్స్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రులే కాకుండా పార్టీలో ఉండే సీనియర్ లీడర్స్ కూడా ఎవరు జగన్ ను టార్గెట్ చేయడానికి పెద్దగా ఇష్టపడలేదు. అయితే మరి కొంతమంది మాత్రం టిడిపిలో చాలా మందికి ప్రాధాన్యత కనిపించలేదని, ఎంతో ఆశతో గెలిపించుకున్న అవకాశాలు రాలేదని అసంతృప్తిలే ఎక్కువగా వినిపిస్తున్నాయట. అంతేకాకుండా జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నేతలు విరుచుకుపడ్డారు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ సైలెంట్ గా మారిపోయారట. ఒకవేళ వైసీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా టార్గెట్ చేస్తారని చాలామంది మంత్రులు సైలెంట్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.