తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆక్వాకి సంబంధించి ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది. అది కూడా సీఎం చంద్రబాబును ఉద్దేశించి.. ఆక్వా రైతుల కష్టాల పైన మా పార్టీ నాయకుల ఆందోళన నా ట్విట్ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. కానీ మీరు పెట్టిన సమావేశ ఫలితాలు క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడ కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు అంటూ తెలిపారు.


మీ సమావేశాలు మీరు చెబుతున్న ప్రకటనలు ప్రచారం కోసమే కాకుండా ఆక్వా రైతులు నిజంగానే మేలు చేసేలా ఉండాలని.. ఆక్వా రైతులు పెట్టుబడితో రొయ్యలకు వేసేటువంటి మేత ప్రధానమైనది.. ఈ మేత పైన 15% వరకు సుంకం విధించినప్పుడు కంపెనీలన్నీ కూడా కిలో ఆరున్నర రూపాయలకు చొప్పున పెంచారు.. మేత తయారు చేసేటువంటి ముడి సరుకుల మీద ఇప్పుడు సుంకం 15% నుంచి 5 శాతానికి తగ్గింది.. అలాగే సోయాబీన్స్ రేటు గతంలో కిలో 105 రూపాయలు ఉండగా ఇప్పుడు 25 రూపాయలకు పడిపోయింది అంటూ తెలిపారు.


మరి ముడి సరుకుల రేట్లు ఇలా తగ్గిపోయినప్పుడు ఆక్వా రైతులు వేసేటువంటి మేత రేట్లు కూడా తగ్గాలి కదా? ఎందుకు తగ్గడం లేదంటు ఈ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటు ప్రశ్నించారు? అమెరికాకి ఎగుమతి అయ్యేటువంటి రొయ్యలన్నీ కూడా 50 కౌంటర్ లోపే.. అమెరికాకు కూడా మన దేశం పైన విధించే టారిఫ్లు 90 రోజులపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు కూడా పెరగాలి కదా ఎందుకు పెరగడం లేదు.. టారిఫ్ తో సంబంధం లేనటువంటి యూరప్ దేశాలకు 100 కౌంట్ రొయ్యలకు మేత అవుతున్నాయి.. వీటి రేటు కూడా పెరగడం లేదు.. ప్రభుత్వం నిర్ణయించినటువంటి 220 రేటు కూడా రైతులకు రావడం లేదంటు..100 కౌంట్ రొయ్యలకు 270 రూపాయలు వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం  తీసుకోవాలంటు తెలిపారు.. మా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు వారి పరిస్థితిలను పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచేదంటూ తెలిపారు. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థలను కూడా పూర్తిగా మార్చేశారు అంటు ట్వీట్ చేసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: