
చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా యనమల రామకృష్ణుడి అమ్మాయికి అవకాశం ఇవ్వడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి బల నిరూపణ సమయంలో యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యవహరించడం జరిగింది. అయితే యనమల రామకృష్ణుడు తాజాగా ఒక సందర్భంలో ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
ఒక ఇంటర్వ్యూలో భాగంగా యనమల మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ ను మించి చంద్రబాబుకే ఆదరణ ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ నాపై సీరియస్ అయ్యారని వాళ్లు టీడీఎల్పీ నేతగా చంద్రబాబునే ఎంచుకోవడం జరిగిందని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో స్పీకర్ గా నా కర్యవ్యాన్ని మాత్రమే నేను నిర్వర్తించానని ఆయన కామెంట్లు చేశారు.
ఆ సమయంలో నేను చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా చేసిన సహాయం అయితే ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. కావాలనే తాను ఎన్టీఆర్ కు మైక్ ఇవ్వలేదని తనపై దుష్ప్రచారం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఇప్పటికీ నాకు ఆవేదన ఉందని యనమల పేర్కొన్నారు. చంద్రబాబు అప్పట్లో సీఎం కాకపోయి ఉంటే ఏపీలో టీడీపీ ఉండేది కాదని భావించే వాళ్లు సైతం ఉన్నారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు రాజకీయాల్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో తెలియాల్సి ఉంది.