
వైసిపి పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గోరంట్ల మాధవ్ ను ఓ పోలీసు అధికారి దారుణంగా కొట్టినట్లు సమాచారం అందుతుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్...ను తాజాగా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
భారతి పై హాట్ కామెంట్స్ చేసిన కిరణ్ ను పోలీసులు తరలిస్తూ ఉండగా... వాళ్ల వాహనాన్ని వెంబడించి మరి... అడ్డుకున్నారు వైసిపి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. అనంతరం... కిరణ్ పై ఎదురు దాడి చేశారు గోరంట్ల మాధవ్. ఈ తరుణంలోనే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. అయినా కూడా తన అనుచరులతో దాడి చేసే ప్రయత్నం చేశాడు.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో... మాజీ పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఓ పోలీసు ఉన్నతాధికారి... మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కొట్టారని అంటున్నారు. గోరంట్ల మాధవ్ చెంప పైన... పోలీస్ అధికారి కొట్టినట్లు తెలుస్తోంది. అనంతరం గోరంట్ల మాధవ్ ను పోలీసులు అదుపులోకి... తీసుకొని.. జైలుకు తరలించారు. తమ విధులకు... ఆటంకం కలిగించారన్న కేసు నమోదు చేసి... మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను జైలుకు తరలించారు. ఇక ఇవాళ... గోరంట్ల మాధవ్ ను కోర్టుకు తరలించనున్నారు పోలీసులు.
ఏపీలోని నెలపాటు పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం గోరంట్ల మాధవ్ ఉన్నారు. అక్కడి నుంచి గోరంట్ల మాధవ్ ను తీసుకువెళ్లి కోర్టులో ప్రవేశపెడతారు పోలీసులు. ఇది ఇలా ఉండగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు టిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్. దీంతో టిడిపి అధిష్టానం అతనిపై సీరియస్ అయి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అటు టిడిపి కార్యకర్తలు పోలీసులు కూడా అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.