
అయితే పవన్ కు సైతం నాదెండ్లకు దూరంగా ఉండాలని గతంలో కొంతమంది సూచనలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం పలు సందర్భాల్లో నాదెండ్లను ఏమీ అనవద్దని సూచించారు. పవన్ తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తుండటం నాదెండ్ల అసంతృప్తికి కారణమని సమాచారం అందుతోంది. ఆదాయ వనరులను పవన్ మాత్రమే చూసుకోవడం కూడా ఈ అసంతృప్తికి కారణమని భోగట్టా.
నాగబాబు విషయంలో సైతం పవన్ నాదెండ్ల మధ్య విబేధాలు వచ్చాయని సమాచారం అందుతోంది. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే పవన్, నాదెండ్ల సన్నిహితులు మాత్రం వైరల్ అవుతున్న వార్తలను నమ్మడం లేదు. చిన్నచిన్న విబేధాలు సాధారణం అని అవి సులువుగానే పరిష్కారం అవుతాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయంలో సైతం గందరగోళం కొనసాగుతోంది. ఈ సినిమాలు ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతాయనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని నెక్స్ట్ లెవెల్ కు ఎదగాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ లుక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని భవిష్యత్తు సినిమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటే పవన్ కళ్యాణ్ కు బాక్సాఫీస్ వద్ద తిరుగుండదని చెప్పవచ్చు.