వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డి చుట్టూ నిన్నటి నుంచి ఏపీ రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే.  వైయస్ భారతి రెడ్డి పైన టిడిపి పార్టీకి సంబంధించిన ఓ కార్యకర్త కిరణ్.... వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో  పెద్ద దుమారం నెలకొంది. అయితే భారతి రెడ్డి పైన హాట్ కామెంట్స్ చేసిన టిడిపి కార్యకర్తలు పోలీసులు కూడా అరెస్టు చేశారు. ఇలాంటి నేపథ్యంలో వైయస్ భారతి ఇష్యూ పైన స్పందించారు  వైయస్ షర్మిల. 

తన వదినమ్మను అన్న టిడిపి  కార్య కర్తలు నడి రోడ్డు పైన ఉరి తీసిన తప్పు లేదంటూ ఆమె ఫైర్ అయ్యారు. వైయస్ భారతి రెడ్డి మీద సోషల్ మీడియా  వేదికగా వ్యాఖ్యలు చేయడం అత్యంత దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం అంటూ ఫైర్ అయ్యారు. ఈ సైకో గాలను నడిరోడ్డు పైన ఉరి తీసిన తప్పులేదని వ్యాఖ్యానించారు. రేటింగ్స్ అలాగే ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాంటి మసాలా వార్తలు రాసే యూట్యూబ్ ఛానల్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు  వైయస్ షర్మిల.


 దీని పై కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి... మహిళలను కాపాడాలని ఆమె కోరారు. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను అస్సలు  హర్షించబోదని వెల్లడించారు. ఇలా తప్పుడు కూతలు కూసిన ఏ పార్టీ నాయకుడి నైనా శిక్షించాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు  వైయస్ షర్మిల. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉందని మండిపడ్డారు. ఈ విష సంస్కృతికి వైసిపి పార్టీ బీజం వేసిందని కూడా గుర్తు... చేశారు. ఇప్పుడు కూటమి పార్టీలు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఈ నీచపు సంస్కృతిని  ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలంటే  అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు  వైయస్ షర్మిల.


మరింత సమాచారం తెలుసుకోండి: