
అయితే ఈ ఫలితాలను కూడా ఆంధ్రప్రదేశ్ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చని వీటి ద్వారా ఎన్నో సేవలను కూడా అందిస్తున్నామంటూ తెలియజేశారు. ఈ వాట్సప్ సేవల ద్వారా కూడా ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చని నారా లోకేష్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా నెంబర్ ని 9552300009 అనే నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెడితే చాలు ఇంటర్ ఫలితాలు వేలుబడతాయని తెలియజేశారు. ఇక అధికారికంగా వెబ్సైట్ విషయానికి వస్తే ap RESULTE.BIE.GOV.IN వెబ్సైట్లో కూడా లాగిన్ అయ్యి విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు అంటూ వెల్లడించారు.
వీటితో పాటు ఏపీ గవర్నమెంట్ యాప్ లలో పాటుగా మనమిత్ర యాప్లలో కూడా ఇంటర్ ఫలితాలను సైతం చూసుకోవచ్చని తెలియజేశారు. మొత్తానికి నారా లోకేష్ ఇంటర్ విద్యార్థుల ఫలితాల పైన ఒక క్లారిటీ ఇవ్వడంతో అటు తల్లిదండ్రులు ఈ విషయం పైన చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. మరి రేపటి రోజున ఎంత మేరకు ఉత్తీర్ణత సాధిస్తారు అనే విషయం పైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది. మరి కొన్ని గంటలలో విద్యార్థుల భవిష్యత్తు తేలనుంది.