ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో తాజాగా టిడిపి నేత ఆత్మహత్య ఒక్కసారిగా కలకలాన్ని సృష్టిస్తోంది. భీమిలి నియోజకవర్గంలో టిడిపి సీనియర్ నేతగా ఉన్న కొరడా నాగభూషణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన భీమిలి వ్యవసాయం మార్కెట్ కమిటీకి మాజీ చైర్మన్ గా ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగభూషణ ఆత్మహత్య చేసుకోవడం ఒక్కసారిగా తీవ్ర విషాదాన్ని భీమిలి నియోజకవర్గంలో నింపినట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి నాగభూషణకు షుగర్, బీపీ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని ఈనెల 8వ తేదీన ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.


అయితే ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో తన అనుచరుడుని కాఫీ తెమ్మని చెప్పి.. తన అనుచరుడు అలా బయటకు వెళ్లిన  తర్వాత నేరుగా ఆసుపత్రి నాలుగవ అంతస్తు పై నుంచి దూకి మరి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అటు రాజకీయంగా ఇటు వ్యాపారపరంగా నాగభూషణకు మంచి పేరు ఉన్నది. కానీ టిడిపి నేత ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. నారాయణరావు ఆత్మహత్య పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.


భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నాగభూషణ ఇంటికి వెళ్లి మరి నివాళులు అర్పించారు. నాగభూషణరావు మృతి టిడిపి పార్టీకి తీరని లోటు అని తెలియజేశారు. పలువురు టిడిపి నేతలు కూడా నాగభూషణరావు మృతికి నివాళులు అర్పించారు. అలాగే నాగభూషణరావు కుటుంబాన్ని కూడా పలువురు టిడిపి నేతలు పరామర్శిస్తూ తమ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామంటూ ధైర్యాన్ని నింపారు. మరి నాగభూషణరావు మృతికి గల కారణాలను పోలీస్ అధికారులు త్వరగా బయట పెట్టాలి అని కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ లోని ఇలాంటి నేతలే ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: