
ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేలలో 71 మంది పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నదని అది కూడా 70% వరకు ఉందనే విధంగా వినిపిస్తోంది. కూటమిలో భాగంగా 164 మంది ఎమ్మెల్యేలు గెలవగా టిడిపి పార్టీ నుంచి 135 జనసేన నుంచి 21 బిజెపి నుంచి 8 మంది గెలవడం జరిగింది. ముఖ్యంగా మద్యం, ల్యాండ్ ,రియల్ ఎస్టేట్ మాఫియా, ఇసుక దందాలు, సూపర్ సిక్స్ హామీలు విఫలం, మహిళలకు రక్షణ లేకుండా పోవడం, నిరుద్యోగులను మోసం చేయడం, వాలంటరీలను తీసివేయడం వంటి వాటిపైన ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయట. మరి కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా విమర్శిస్తున్నారు.
రాయలసీమ:
1). అనంతపురం:
పెనుగొండ, కదిరి, మడకశిర, అనంతపురం అర్బన్, సింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్
2). కడప:
కోడూరు, రాయచోటి
3). చిత్తూరు:
తిరుపతి, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గంగాధర నెల్లూరు
4). కర్నూలు:
ఆదోని, డోన్, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, పాణ్యం
1).విశాఖపట్నం:
ఎలమంచి, అనకాపల్లి, నర్సీపట్నం, పెందుర్తి
2). విజయనగరం:
సాలూరు, నెల్లిమర్ల, పార్వతీపురం, కురుపాం
3). వెస్ట్ గోదావరి:
తాడేపల్లిగూడెం, ఉంగటూరు, నిడదవోలు, నరసాపురం, చింతలపూడి, పోలవరం
4). ఈస్ట్ గోదావరి:
గన్నవరం, రాజోలు, కొత్తపేట, తుని, రాజానగరం, రామచంద్రపురం.
5). కృష్ణ:
కైకలూరు, నందిగామ, తిరువూరు, నూజివీడు
6). ప్రకాశం:
చీరాల, గిద్దలూరు, మార్కాపురం, కందుకూరు
7). గుంటూరు:
తెనాలి, బాపట్ల, నరసరావుపేట, పేద కూరపాడు
8). నెల్లూరు:
సర్వేపల్లి, కావాలి, ఉదయగిరి
కూటమి ప్రభుత్వ పనితీరు పైన కూడా ప్రజలు అసంతృప్తితోనే ఉన్నారు.ఒకవేళ ఇదే పద్ధతికి కొనసాగితే కూటమి ప్రభుత్వానికి దెబ్బ పడుతుంది. 2029 ఎన్నికలలో వైసీపీ పార్టీకి ఇది అనుకూలంగా మారే అవకాశం ఉన్నది కనుక కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సిందే.