
ప్రకృతిని కాపాడుతూ... అందరికీ ఆదర్శంగా నిలిచారు వనజీవి రామయ్య. ఈ నేపథ్యంలోనే పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకున్నాడు. వనజీవి రామయ్య చేసిన సేవలకు... 2017 లో... పద్మశ్రీ అవార్డు అందించింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి ప్రకృతి ప్రియుడు వనజీవి రామయ్య మృతి చెందడంతో.. జనాలతో పాటు చెట్లు కూడా విలసిల్లిపోతున్నాయి. ప్రకృతి ప్రియుడు మరణించడంతో.. ప్రకృతి కూడా.. ఆగమైపోతోంది. అయితే వనజీవి రామయ్య... మొక్కలు నాటడం అలాగే వాటిని సంరక్షించడం మాత్రమే కాకుండా... ప్రకృతికి సంబంధించిన అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సక్సెస్ అయ్యారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి.. అవకాశాన్ని కూడా వదులుకోలేదు.
పాఠ్యాంశాలలో వనజీవి రామయ్య జీవిత కథ
వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. వృక్షో రక్షిత రక్షితః అంటూ మొక్కల పెంపకాన్ని ఆయన చాలా సక్సెస్ఫుల్గా ప్రచారం చేయడం జరిగింది. తన కుటుంబ సభ్యులకు చెట్ల పేర్లను పెట్టడం ప్రకృతి పట్ల ఆయన ప్రేమకు నిదర్శనమై చెప్పవచ్చు. గులాబీ పార్టీ ప్రభుత్వం హయాంలో.. హరితహారం కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఒక మొక్కను గిఫ్ట్ గా ఇచ్చి... వాళ్లకు అవగాహన కల్పించేవారు వనజీవి రామయ్య. ఆయన కృషిని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరవ తరగతి పాఠ్యాంశాలలో రామయ్య జీవితాన్ని కూడా చేర్చడం జరిగింది.