నటి విజయశాంతి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, లాంటి హీరోలకు సమానమైనటువంటి సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా మారింది. అలాంటి విజయశాంతి కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన మైలు రాయిని ఏర్పాటు చేసుకుంది. తాజాగా ఈమె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి పొంది ప్రమాణ స్వీకారం కూడా చేసింది. ఇదంతా బాగానే ఉన్నా తాజాగా విజయశాంతి దంపతులకు బెదిరింపులు వచ్చాయట. ఒక వ్యక్తి బెదిరిస్తూ చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. విజయ శాంతి దంపతులకు బెదిరింపులు చేసింది చంద్ర శేఖర్ రెడ్డి అని తెలుస్తోంది.

అయితే ఈయన నరకం అంటే ఏంటో చూపిస్తాను అంటూ విజయశాంతి తో అన్నారట. అయితే చంద్రశేఖర్ రెడ్డి గతంలో విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ ని మెయింటెన్ చేస్తూ మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తానని చెప్పి చాలా డబ్బులు నొక్కేసారట. చివరికి డబ్బు ముట్టిన తర్వాత అలాంటి పని ఏమి చేయకుండా  రివర్స్ వీరిని బెదిరిస్తున్నారట. ఇలా ఎందుకు చేశావు అని విజయ శాంతి ప్రశ్నిస్తే  నిన్ను చంపేస్తాను, నరకమంటే ఏంటో చూపిస్తానంటూ ఎస్ఎంఎస్ మెయిల్స్ పంపిస్తూ భయానికి గురి చేస్తున్నాడట.

 దీనిపై స్పందించిన విజయ శాంతి దంపతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకునే పని లో పడ్డారు. విజయ శాంతి సినిమా కెరియర్ విషయానికొస్తే తాజాగా ఆమె "అర్జున్ సన్నాఫ్ వైజయంతి" సినిమాలో పవర్ఫుల్ ఐపీఎస్ పాత్రలో నటించబోతుందట. ఈ చిత్రంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇంత పెద్ద పలుకుబడి ఉన్న ఈమెకే భద్రతాపరంగా ఇబ్బందులు ఏర్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: