ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తవుతుంది .. 2024 సాధారణ ఎన్నికలలో తెలుగుదేశంతో పాటు జనసేన బిజెపి పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని ఉమ్మడి గా ఎన్నికలలో పోటీ చేసి అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేశాయి . రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేనంత దారుణంగా ప్రతిపక్ష వైసిపిని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశాయి . కూటమిలో కీలక పాత్ర పోషించిన జనసేన తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ రెండు పార్లమెంటు సెట్లలో ఘనవిజయం సాధించింది . ఇది ఇలా ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు . ఇప్పటికీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి పది నెలలు పూర్తవుతున్న ఇప్పటికీ చాలా స్లోగా పదవుల భర్తీ నడుస్తోంది .


 కొన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులతో పాటు కొన్ని ప్రముఖ ఆలయాల బోర్డులు భర్తీ చేయటం మినహా ఇంకా చాలా నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి . ఇదిలా ఉంటే మండల స్థాయిలో కీలకమైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలబోర్డులను కూడా చంద్రబాబు ఇప్పటి వరకు భర్తీ చేయలేదు .. వాస్తవానికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు చివరిసారిగా 2013లో ఎన్నికలు జరిగాయి . రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో సొసైటీలకు ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగలేదు. చంద్రబాబు ప్రభుత్వం తొలి ఐదేళ్లు నామినేటెడ్ బోర్డులతో కాలం గడిపేసింది. ఆ తర్వాత వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక ఐదేళ్లు కూడా నామినేటెడ్ బోర్డ్లతో కాలం గడిపేసింది. ఇక ఇప్పుడు చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కూడా నామినేటెడ్ బోర్డులను వేస్తుందని అందరూ అనుకున్నారు .



 అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ విషయం పై పునరా ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. సొసైటీ పాలకవర్గాలను నామినేటెడ్ పదవులతో భర్తీ చేయటం కన్నా ఎన్నికలు జరపాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలు జరిపి ఎన్నికల్లో విజయం సాధించిన బోర్డర్ తోనే సొసైటీలను నడిపించాలని చంద్రబాబు దాదాపు నిర్ణయం తీసుకున్నారని ఈ మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీలో సొసైటీ ఎన్నికలు జరిగితే గ్రామస్థాయిలో రాజకీయం మామూలుగా ఉండదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: