
ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం రాజకీయ ఆధిపత్య పొరలో భాగంగా జగన్ పై ఒత్తిడి చేసి గత ఏడాది ఎన్నికలలో అనిల్ కుమార్ ను నెల్లూరు నుంచి తప్పించింది ఈ క్రమంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసారావు పేట నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు . అంతకుముందు వైసీపీ ఎంపీగా ఉండి ఎన్నికలకు ముందు తెలుగుదేశం కండువా కప్పుకుని పోటీచేసిన లావు శ్రీకృష్ణదేవరాయుల చేతిలో అనిల్ కుమార్ యాదవ్ చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఎన్నికలలో ఓటమి తర్వాత జగన్ అనిల్ కుమార్ ను నరసరావుపేట నుంచి తిరిగి నెల్లూరుకు పంపించేశారు. వచ్చే ఎన్నికలలోను నెల్లూరు సిటీ నియోజకవర్గ నుంచి మరోసారి పోటీ చేయాలని అనుకుంటున్నారు.
అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయా లను శాసించే బలమైన రెడ్డి సామాజిక వర్గం మరోసారి జగన్ పై ఒత్తిడి చేసి అనిల్ కుమార్ ను నెల్లూరు సిటీ నుంచి తప్పించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని అనిల్ కుమార్ ను తిరుపతి జిల్లాలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గానికి మారుస్తారన్న ప్రచారం వైసిపి వర్గాలలో జరుగుతుంది. వైసీపీ అధినేత జగన్ సైతం అనిల్ ను నెల్లూరు వదిలి వెంకటగిరి కి వెళ్లి అక్కడ పనిచేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది . ఇప్పటికే నెల్లూరు సిటీ నుంచి నరసరావుపేటకు బదిలీపై వెళ్లిన అనిల్ తిరిగి ఇప్పుడు నెల్లూరు సిటీకి వచ్చి మరోసారి వెంకటగిరికి బదిలీపై వెళ్లక తప్పని పరిస్థితి . ఇక మరి వెంకటగిరిలో అనిల్ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి