వైసీపీలో రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయంగా ఆధిపత్యం ఉంటుంది.. వైసీపీ అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకే ఇక్కడ ఎక్కువగా పదవులు లభిస్తూ ఉంటాయి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు జగన్ 2019 ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చారు. అప్పుడు వైసిపి నుంచి ఏకంగా 52 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీనిని బట్టి వైసీపీలో రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయ ఆధిపత్యం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. రాజకీయంగా పెద్దపేట వేసేందుకు జగన్ మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన వారికి చాలా సందర్భాలలో షాక్ లో ఇస్తూ ఉంటారు.


అయితే తాజాగా వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చల ప్రకారం జగన్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది . ఆ నేత ఎవరో కాదు దివంగత మాజీ ముఖ్యమంత్రి నిదురిమిల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి కావటం విశేషం. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్న నెదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి ఐదేళ్లపాటు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ ఎన్నికలలో ఆయనకు వెంకటగిరి అసెంబ్లీ సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.. అయితే చివర్లో టిడిపి నుంచి అనుహికంగా వైసీపీలో చేరిన ఆనం వెంకట రామనారాయణరెడ్డి ఆ సీటు దక్కించుకున్నారు.. ఇక మొన్న ఎన్నికలలో ఆనం పార్టీ మారిపోవడంతో రాంకుమార్ రెడ్డి వెంకటగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి  పాలయ్యారు .. అయితే తాజాగా జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ..


గతంలో రెండుసార్లు నెల్లూరు సిటీ నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ గత ఎన్నికలలో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ప్రస్తుతం మార్పులు చేర్పులలో భాగంగా జగన్ అనిల్ కుమార్ ను వెంకటగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం వెంకటగిరి వైసీపీ ఇన్చార్జిగా ఉన్న నేదురుమిల్లి రామ్‌కుమార్ రెడ్డికి పెద్ద షాక్ తప్పదు .. అనిల్ కుమార్ వెంకటగిరి వైసీపీ ఇన్చార్జిగా వస్తారన్న వార్తలతో వెంకటగిరిలో ఉన్న నెదురుమల్లి అనుచరుగణం వైసీపీ అధిష్టానం పై తీవ్రస్థాయిలో మండిపడుతుంది. రామ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారని ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన తప్పిస్తే నియోజకవర్గం లో పార్టీ భారీగా నష్టపోవడం ఖాయమని వైసిపి లోనే అసమతి గళాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: