దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తరం నుంచే వైయస్సార్ జక్కంపూడి కుటుంబాల మధ్య ఎంతో అనుబంధం ఉండేది . గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఎంతో ప్రయారిటీ ఇచ్చారు .. జక్కంపూడి రామ్మోహన్ రావు మంత్రిగా ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు .. అయిన రాజశేఖర్ రెడ్డి ఆయన మీద ఉన్న అభిమానంతో రామ్మోహన్రావును క్యాబినెట్లో అలాగే కంటిన్యూ చేశారు. ఆయన మరణం ఆయన భార్య జక్కంపూడి విజయలక్ష్మి కి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే సీటు ఇచ్చారు .


రాజశేఖర్ రెడ్డి మరణం తరం జక్కంపూడి కుటుంబం జగన్ చెంత చేరింది 2014 ఎన్నికలలో జగన్ సైతం జక్కంపూడి విజయలక్ష్మి కి రాజానగరం అసెంబ్లీ సీటు ఇవ్వగా ఆమె ఓడిపోయారు .. 2019 ఎన్నికలలో విజయలక్ష్మి పెద్ద కుమారుడు జక్కంపూడి రాజా వైసిపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు .. ఆ క్రమంలోనే రాజాకు జగన్ కీలకమైన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ కు పార్టీ యువజన విభాగంలో కీలకమైన పదవి కట్టబెట్టారు . అలాగే రాజాకు ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా అప్పగించారు .. అయితే తాజాగా జక్కంపూడి గణేష్ పార్టీ అధిష్టానం పై అసహనం వ్యక్తం చేస్తూ తాను పార్టీ విడుతానని చెబుతున్న సంగతి తెలిసిందే..


జక్కంపూడి సోదరులు జనసేనలో చేరేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు అన్న ప్రచారం కూడా నడుస్తోంది..  ఇది ఇలా ఉంటే జక్కంపూడి గణేష్ అసహనానికి కారణం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి పదవి అని తెలుస్తోంది.. గణేష్ రాజమండ్రి రూరల్ ఇన్చార్జి పదవి కోరగా దానిని ఇచ్చేందుకు జగన్ ఓకే చెప్పారని అయితే మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ దానికి అడ్డుకున్నరానే ప్రచారం జరుగుతుంది ..అందుకే జక్కంపూడి గణేష్ పార్టీ అధిష్టానం పై తన అసహనం వ్యక్తం చేయడంతో పాటు తాను పార్టీ నుంచి బయటికి వస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు అన్న ప్రచారం వైసిపి వర్గాలోను అంతర్గతంగా వినిపిస్తోంది .. మరి ఈ ముసలం ఎటువైపు దారితీస్తుంది దీనికి ఎలా ఎండికార్డు పడుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: