
తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త కిరణ్, వైఎస్ భారతి రెడ్డి పై విమర్శలు చేసిన నేపథ్యంలో అరెస్టు చేయడం తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం పోలీసులు అరెస్టు చేయడం జరిగింది . అయితే కిరణ్ అరెస్టు పై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం తో పాటు ఐటీడీపీ విభాగంలోనూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగంలోనూ తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తల లోనూ చంద్రబాబు , లోకేష్ పై తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి . గతంలో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పై అప్పటి వైసిపి సానుభూతిపరుడుగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రమైన విమర్శలు చేశారు. అలాగే అప్పుడు మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు సైతం ఇదే అంశంపై తీవ్రమైన విమర్శలు చేశారు.
వారిని ఈ కేసులలో అరెస్టు చేయకుండా ఉరికే చూస్తున్న కూటమి ప్రభుత్వం సొంత పార్టీకి చెందిన కార్యకర్తను అరెస్టు చేయించడంతో పార్టీ కార్యకర్తలు బొగ్గుమంటున్నారు .. చంద్రబాబు మళ్ళీ కార్యకర్తలకు పార్టీకి దూరమవుతున్నారని ఆయన తీరు మార్చుకోకపోతే తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల వరకు అవసరం లేకుండానే డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతుందని పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .. చంద్రబాబు , లోకేష్ ఇప్పటికైనా పార్టీ కార్యకర్తల తో పాటు పార్టీని పట్టించుకుంటేనే పార్టీ పట్టిష్టంగా ఉంటుందని లేకపోతే 2019 ఎన్నికలలో పార్టీ ఎంత దారుణంగా ఓడిపోయిందో మరోసారి అదే పరిస్థితి పునరావృతం కాక తప్పదని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇస్తున్నారు .. మరియు ఈ విషయంలో చంద్రబాబు పార్టీని కార్యకర్తలను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తారో చూడాల్సి ఉంది