
ఇప్పటికే అధికార డిఎంకె కాంగ్రెస్ మిత్ర పక్షాలుగా కొనసాగుతున్నాయి .. వచ్చే ఎన్నికలలోను మరోసారి ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి .. ఇక విజయ్ కు ఎన్నికల వ్యూహకర్తగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ సైతం అన్నాడీఎంకేతో విజయ్ పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేసేలా ప్రతిపాదన తెచ్చారని ప్రచారం జరిగింది .. విజయ్ కూడా అందుకు తగినట్టుగానే అన్నాడీఎంకేను ఒక్క మాట కూడా అనేవారు కాదు .. డిఎంకె తన ప్రధాన శత్రువుగా ప్రకటించుకున్నారు .. అన్న డీఎంకేతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే తమిళనాడును దున్ని పారేయవచ్చని విజయ్ భావించారు అందుకు తగినట్టుగానే ఆయన అడుగులు వేస్తూ వచ్చారు .. ఎప్పుడు అయితే బిజెపి సీన్లోకి వచ్చిందో ఇప్పుడు తమిళనాడు రాజకీయంలో విజయ్ ఒంటరివాడు అయిపోయాడు ..
నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకె తో కలిసి పోటీ చేసిన బిజెపి తమిళనాడులో చాలా ఎన్నికల తర్వాత గౌరవప్రదమైన సీట్లు ఓట్లు సాధించింది .. అయితే అన్నామలై ద్వారా బిజెపి తమిళనాడు లో ఎదిగేందుకు ప్రయత్నం చేసింది .. అయితే అన్నమలై జయలలిత పై తీవ్రమైన విమర్శలు చేశారు .. ఆయనతో కలిసి ఉంటే తమ పార్టీ పరువు పోతుందని భావించిన పళనిస్వామి బిజెపితో తెగతింపులు చేసుకొని బయటకు వచ్చారు .. ఇప్పుడు బిజెపి , అన్న డీఎంకేతో పొత్తు కోసం అన్నామలైను సైతం పక్కన పెట్టి మరి వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్న పరిస్థితి .. ఏది ఏమైనా తమిళనాడు రాజకీయంలో విజయ్ ఒంటరివాడు అయిపోయాడు అన్నది మాత్రం నిజం ..