ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు ఈ రోజున ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70% ఉత్తీర్ణత రెండవ సంవత్సరం విద్యార్థుల్లో 83 శాతం ఉత్తీర్ణత సాధించారు. గడచిన పదేళ్లలో అత్యధికంగా శాతం విద్యార్థులు ఈ ఏడాది పాసయ్యారని మంత్రి నారా లోకేష్ ఆనందంతో తెలియజేశారు. ఇంటర్ ఫస్టియర్ రెగ్యులర్ విద్యార్థులు 4,87,295 మంది ఇంటర్ విద్యార్థులు.. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలు విషయానికి వస్తే 4,22,030 మంది విద్యార్థులు హాజరయ్యారు మొత్తం మీద 9,09,325 మంది రాశారు.


రెగ్యులర్ ఇంటర్ విద్యార్థు 3,51,521 మంది పాసయ్యారు అంటే 83%.. సెకండ్ ఇయర్ రెగ్యులర్ల బాలురు 80 శాతం మంది.. బాలికలు 86% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక జిల్లాల వైపుగా వస్తే ఇంటర్ ఫలితాలలో 93% కృష్ణా డిస్ట్రిక్ట్ మొదటి స్థానంలో ఉన్నది.. ఆ తర్వాత 91% లో గుంటూరు జిల్లా.. 89% లో ఎన్టీఆర్ జిల్లా మూడవ స్థానం.. నెల్లూరు విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా 87% ఉత్తీర్ణత సాధించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా 73% ఉత్తీర్ణత.. అనకాపల్లి చివరి స్థానంలో నిలిచింది.


కృష్ణాజిల్లా మొదటి స్థానంలో 85% ఉత్తీర్ణత ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో నిలిచింది. 82, 81, 71 శాతంతో ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం ,గుంటూరు జిల్లాలు నిలవగా అనంతపురం 13వ స్థానంలో ఉండగా..54% ఉత్తీర్ణతతో చిత్తూరు చివరి స్థానంలో పరిమితమైంది. అలాగే వచ్చే నెల నుంచి 12వ తేదీ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జరగబోతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ కాలేజీలలో కూడా మంచి ఫలితాలు వచ్చాయని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ఉత్తీర్ణత కాని విద్యార్థులు ఎవరూ కూడా ఆ ధైర్య పడవద్దు మరింత రెట్టింపు ఉత్సాహంతో పరీక్షలు రాసి విజయాన్ని అందుకోవాలని సూచించారు. మొత్తానికి ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలుపడ్డాయి ఇక రాబోయే రోజుల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలబడునున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: