గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పైన పలు రకాల అనుమానాలు ఉన్నాయంటు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా సంబంధించి పోలీసు అధికారుల సహిత కేసును విచారించి మరి అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రవీణ్ హత్య జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తాము సీసీటీవీలను చూసిన తర్వాత అన్నిటిని పరిశీలించి ఆరోపణలు చేసిన వారందరినీ కూడా ప్రశ్నించామని వారి వద్ద కూడా ఎలాంటి ఆధారాలు లేవని పోలీస్ అధికారులు తెలియజేశారు.


ప్రవీణ్ పగడాల హత్య జరిగిందని దానికి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఉన్నత అధికారుల మీడియా సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసి మరి పోస్టుమార్టం లోనే నివేదిక కూడా హత్య జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదని తెలియజేశారు అధికారులు. ప్రవీణ్ హైదరాబాదు నుంచి రాజమండ్రి కి బుల్లెట్ బైక్ పైన వెళుతున్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో మరణించారు. అయితే ఈ మృతి పైన చాలా ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో ఈ కేసుని ప్రభుత్వం చేదించాలంటూ ఉన్నత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. అనంతరం పోలీస్ అధికారులు కూడా ఈ ఘటన పైన ప్రతిష్టాత్మకంగా విచారణ చేపట్టారు.



సుమారుగా 200 సిసి ఫుటేజ్ లను కూడా పరిశీలించిన తర్వాతే ప్రవీణ్ హత్యకు గురి కాలేదనే విషయాన్ని పోలీసులు తెలియజేశారు. ప్రవీణ్ మృతికి అనుమాదాస్పదంగా కేసులు నమోదు అవ్వడం చేత విచారణ చేపట్టారని.. సోషల్ మీడియాలో వచ్చేటువంటి రూమర్స్ ని ఎవరు నమ్మవద్దండి అంటు పోలీస్ అధికారులు తెలిపారు. హత్య జరిగినట్లుగా ఆరోపణలు మాత్రమే వినిపించాయి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి మరి విచారణ చేశామని వారి వద్ద ఉన్న ఆధారాలను తమకు ఇస్తే  పరిశీలిస్తామంటూ తెలిపారు.అయితే ఆరోపణలే చేశారు కానీ ఆధారాలు లేవని పోలీస్ అధికారులు తెలిపారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ లభించిన ఆధారాల మేరకే ఇది రోడ్డు ప్రమాదంగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: