
ఆ సుంకాలు పెరగడంతో ఎగుమతులు భారీ స్థాయిలో నిలిచిపోయి సంక్షోభం నెలకొంది. ఈ సంక్షోభం ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల పైన పడుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా రైతులను ఆదుకోవాలని ఏకంగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి ట్విట్ చేశారు. వాస్తవానికి ఆక్వా రైతులు చాలామంది కూటమి వైపు ఉన్న సంగతి తెలిసిందే. ఆక్వా వ్యాపారస్తులు కూడా కూటమి పార్టీకి బాగా సపోర్ట్ చేశారు.
ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేసిన ఆక్వా రైతులు అలాగే వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. దీన్ని గమనించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి... ఆక్వా రైతుల కోసం రంగంలోకి దిగి ట్విట్ చేశారు. ఆ రైతులను ఆదుకోవాలని కోరారు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన చంద్రబాబు... ఏపీ ఆక్వా రైతులకు శుభవార్త చెప్పారు. రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం.
ఏపీలో రొయ్యల మేత ధరను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రొయ్యల మీద తయారీ దారుల సంఘం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. రొయ్యల మేత కిలో పైన నాలుగు రూపాయలు చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఇకపైన రొయ్యల మేత కిలో తీసుకుంటే నాలుగు రూపాయలు చొప్పున రైతులకు ఆదా అవుతాయి. అయితే జగన్మోహన్ రెడ్డి కారణంగానే.. కూటమి ప్రభుత్వం దిగి వచ్చిందని వైసీపీ నేతలు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ దెబ్బకు కూటమి కుదేలవుతోందని కూడా అంటున్నారు.