
ఈ పొలిటికల్ అడ్వైజరి కమిటీని సింపుల్ గా పిఎసి అని పిలుస్తారు. అయితే తాజాగా ఈ పీఏసీ లో ముద్రగడ పద్మనాభానికి కీలక పదవి ఇచ్చారు. దీంతో ఇకపైన ముద్రగడ సలహా సూచనలను కూడా వైసిపి పార్టీ తీసుకోబోతుందన్నమాట. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించిన వైసీపీ పార్టీలో చేరారు ముద్రగడ పద్మనాభం.
కాపులందరూ ఏకమై వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని... ప్రచారం కూడా చేశారు ముద్రగడ పద్మనాభం. అదే సమయంలో కాకినాడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపథం చేశారు. పవన్ కళ్యాణ్ ఓడిపోతే తన పేరును మార్చుకుంటానని కూడా సవాల్ విసిరారు. ముందుగా సవాల్ విసిరిన తరహాలోనే ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు.
ఇక ఏపీలో వైసిపి ఓడిపోయి కూటమి ప్రభుత్వం రాగానే... ముద్రగడ పద్మనాభం పై.... కూటమి నేతలు అనేక కుట్రలు చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన ఇంటి దగ్గర టిడిపి పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన కొందరు హల్చల్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా.. వైసిపికి చెందిన పిఏసిని 33 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో తాజాగా ముద్రగడ పద్మనాభానికి అవకాశం వచ్చింది.