
ఈ దెబ్బ నేరుగా మన టెకీలపై పడనుంది. భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం పొంచి ఉంది. డెల్లాయిట్, యాక్సెంచర్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఉద్యోగులు ఇప్పుడు భయాందోళనలో ఉన్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లేఆఫ్స్ తప్పవని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ కంపెనీలు అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, వీటిలో పనిచేసే వారిలో ఎక్కువ మంది భారతీయులే. అంతేకాదు, భారతదేశం నుంచి కూడా అనేక మంది టెకీలు ఈ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ రద్దు కావడంతో, ఈ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
కోట్ల రూపాయల కాంట్రాక్టులు రద్దు కావడంతో ఆయా సంస్థలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడతాయి. తొలుత ఉద్యోగులపై వేటు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు లేఆఫ్స్‌తో అల్లాడుతున్నాయి. ఇప్పుడు పెంటగాన్ తీసుకున్న ఈ నిర్ణయం భారత టెకీలకు మరింత కష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. ఇది కేవలం ఒక కంపెనీకో, కొద్దిమంది ఉద్యోగులకో సంబంధించిన విషయం కాదు.
భారతదేశ ఐటీ రంగానికి ఇది ఒక హెచ్చరిక లాంటింది. మున్ముందు ఇలాంటి పరిణామాలు మరిన్ని ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి. ఏది ఏమైనా ట్రంపు మస్కు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియన్స్ కి చాలా పెద్ద తిప్పలు ఎదురవుతున్నాయి. అక్కడికి వెళ్లి చదువుకుంటున్న స్టూడెంట్స్ కూడా తీవ్ర నిరాశలో మునిగితేలుతున్నారు.