అలనాటి నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయశాంతి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సినీ ఇండస్ట్రీలో విజయశాంతి చేసిన పాత్రలు మరెవరు చేయలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విజయశాంతి ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ కొనసాగించింది. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం విజయశాంతి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ పదవిని అందుకున్నారు. ప్రస్తుతం విజయశాంతి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు.



ఇక చాలాకాలం తర్వాత విజయశాంతి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ హీరోయిన్ గా కాకుండా ఎక్కువగా అమ్మ పాత్రలలో నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విజయశాంతి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. విజయశాంతి నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా....విజయశాంతి అతనికి తల్లి పాత్రను పోషించింది. ఈ సినిమాలో తల్లి కొడుకుల సెంటిమెంట్ చాలా అద్భుతంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో విజయశాంతి చాలా కాలం తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు.


 కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం. ఈవెంట్లో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా నిలుచున్న మహిళ కేవలం విజయశాంతి ఒక్కరేనంటూ ఎన్టీఆర్ అన్నారు. ఈ ఈ ఘనత దేశంలో మరో హీరోయిన్ ఎవరు సాధించలేరని ఎన్టీఆర్ చెప్పారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె చేసిన పాత్రలు మరెవరు చేయలేరని ఎన్టీఆర్ అన్నారు. ఈవెంట్ లో విజయశాంతి మాట్లాడుతుంటే నాన్న లేని లోటు లేనట్టు అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈవెంట్ లో విజయశాంతి మాట్లాడుతుండగా అక్కడ ఉన్న అభిమానులు అదేపనిగా అరుస్తూ ఉన్నారు. దాంతో కోపం వచ్చిన ఎన్టీఆర్ మొదట కాస్త ఓపిక పట్టాడు. అనంతరం నేను వెళ్లిపోనా అంటూ స్టేజీ దిగేందుకు సిద్ధపడ్డారు. దీంతో విజయశాంతి ఎన్టీఆర్ ను కాసేపు సముదాయించారు. ఆ తర్వాత అభిమానులు కాసేపు సైలెంట్ గా ఉన్నారు. గతంలోనూ చాలా సందర్భాలలో పలువురు హీరోలు మాట్లాడుతుండగా అభిమానుల అత్యుత్సాహం చాలామంది హీరోలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇదిలా ఉండగా... అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: