ఆంధ్రప్రదేశ్లోని నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో 2024 ఎన్నికలలో గెలవడం జరిగింది. దీంతో విద్యాశాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి సైతం తనవంతు కృషి చేస్తూ ఉన్నారు నారా లోకేష్. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టిన నారా లోకి తాజాగా 100 పడకల ఆసుపత్రిని సైతం నిర్మించే విధంగా శంకుస్థాపన చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం చిన్న కాకాని వద్ద 7.35 ఎకరాలలో సుమారుగా 50 కోట్ల రూపాయల ఖర్చుతో ఆస్పత్రిని నిర్మిస్తున్నారట.


ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ 1984లో 30 పడకల ఆసుపత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు శంకుస్థాపన చేశారని యువగళం పాదయాత్రకు వచ్చినప్పుడు అక్కడ 30 మంది మాత్రమే సరిపోయే ఆసుపత్రి ఉందని దానిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తానని చెప్పానని.. అందుకు తగ్గట్టుగానే వంద పడకల ఆసుపత్రిని సైతం తీసుకువస్తూ ప్రైవేటు ఆసుపత్రికి దిటుగానే గవర్నమెంట్ ఆసుపత్రి ఉంటుంది అంటూ నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.


అలాగే అమరావతి రాజధాని పనులు కూడా మొదలయ్యాయని ఈ ఆసుపత్రిలో డిహైడ్రేషన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు. తాను మంగళగిరిలో ఓడిపోయినప్పటి నుంచి ప్రజలకు మరింత దగ్గరగా అయ్యానని.. మంగళగిరి పానకాల స్వామి గుడి కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగిందని త్వరలో మరిన్ని పనులను కూడా చేస్తానంటూ నారా లోకేష్ తెలియజేశారు. 2019లో ఓడిపోయినప్పుడు తనని చాలామంది హేళన చేశారని మంగళగిరి ప్రజలు దానిని దీటుగా తనని గెలిపించడం జరిగింది అంటూ నారా లోకేష్ తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసి మరి నెంబర్ వన్ స్థానంలో ఉండేలా చేయడమే తన బాధ్యతగా తీసుకున్నానని నారా లోకేష్ తెలిపారు. మొత్తానికి తన నియోజకవర్గంలో చరిత్రలో నిలిచిపోయాలా నారా లోకేష్ ఒక నిర్ణయం తీసుకున్నారని కార్యకర్తలు సైతం ఆనంద పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: