ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్ పైన రెండు రూపాయల వరకు పెంచింది. అయితే ఇది కేవలం ఆయిల్ సంస్థలు మాత్రమే భరించాలంటు తెలియజేసింది. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ మార్కెట్లోని చమురు  ధరలు భారీగా పతాక స్థాయికి చేరడంతో ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా తగ్గే అవకాశాలు ఉన్నాయట. అయితే తగ్గుదలకు ముఖ్య కారణం చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కావడం చేత తగ్గే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి



బ్రెంట్ క్రూడ్ ఆయిల్ , WTI క్రూడ్ ఆయిల్ ధరలు గమనియంగా కూడా తగ్గడంతో EIA ప్రపంచ ఆర్థిక అభివృద్ధి  కాంచనలు కూడా తగ్గించింది. ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఇంధన డిమాండ్ మీద పడింది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి దారి అయినప్పటికీ కూడా అమెరికా టారిఫ్ల పైన తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఇది చమురు వినియోగాన్ని కూడా తగ్గించేలా చేస్తోందట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ లీటర్ ధర రూ.110-112 రూపాయలు ఉండగా.. డీజిల్ ధర 98-100 రూపాయల వరకు ఉన్నది. తెలంగాణలో పెట్రోల్ విషయానికి వస్తే..108-110 రూపాయలు ఉండదు డీజిల్ ధర.96- 98  రూపాయల మధ్య ఉన్నది.


అయితే అంతర్జాతీయ చమురు ధరల పతాకం కావడం చేత రెండు తెలుగు రాష్ట్రాలలో డీజిల్ పైన 2 నుంచి 4 రూపాయలు.. అలాగే పెట్రోల్ పైన..3- 5 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంటుందట. ఈ ధరలు రాబోయే రెండు లేదా మూడు వారాల అమలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదట. 2025 మేనాటికి చమురు ధరలలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు , వ్యాట్ పై కూడా మార్పులు చేస్తే ఇంధన  ధరలు మరింత తగ్గేందుకు ఆస్కారం ఉన్నదట. ఇప్పటికే ప్రభుత్వాలు పన్నులు తగ్గించకుండా ప్రజల పైన అధిక బారాలు వేస్తున్నారని విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఈ ధరలు తగ్గుదల ఊరట నిస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: