
నేను ఈ బాధ్యత తీసుకుంటాను.. మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి.. మీరు వచ్చి దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని ప్రగతిలోకి తీసుకురావాలి. పాడైన రాష్ట్రాలను బాగు చేయాలి అంటూ పదాలను ఉపయోగించి ఒక లేఖ రాశారు. అలాగే ఏపీ పేద ప్రజలకు సైతం ఆక్సిజన్ లాంటివారు జగన్ అంటూ ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం పీఠాన్ని ఎవరు తొంగి చూడకుండా ఉండేలా పరిపాలన సాగించాలని తన కోరిక అంటూ తెలిపారు ముద్రగడ పద్మనాభం. 2029లో అధికారం కచ్చితంగా వస్తుందని నమ్మకాన్ని తెలియజేస్తూ అందుకు తగ్గట్టుగా కృషి చేస్తానంటూ ముద్రగడ పద్మనాభరెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.
ప్రస్తుతం కూటమిపాలనలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఇలా పరోక్షంగానే విమర్శిస్తూ లేఖ రాసినట్లు కనిపిస్తోంది. ఇలా మరొకసారి జగన్ పైన ఉండే ప్రేమ ఆత్మీయతను చూపిస్తు వైసిపి పార్టీని 2029 ఎన్నికల నాటికి బలోపేతం చేసి విజయం సాధించాలని అందుకు తగ్గట్టుగా పనిచేస్తామంటు తెలిపారు ముద్రగడ. ఇక ముద్రగడ పద్మనాభరెడ్డి గిరికి కూడా గతంలో కూడా ఒక కీలకమైన పదవి అప్పగించారు. అలాగే కంటిన్యూ అవుతున్నారు. తద్వాల రాజకీయపరంగా కూడా తమ కుటుంబానికి తనకి సంబంధించిన వాటన్నిటిలో కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు వైసిపి పార్టీ. మరి ముద్రగడ పద్మనాభ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలను తీసుకుని వెళ్తారో చూడాలి.