
ఈ నేపథ్యంలోనే తాజాగా... తిరుమల శ్రీవారి సన్నిధిలో 17 లక్షల విరాళం అందించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజినోవ. తిరుమల శ్రీ తరిగొండ వెంగలాంబ అన్నదాత సత్రానికి భారీ విరాళం అందించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజినోవ . తన కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద ఏకంగా 17 లక్షల విరాళం అందించడం జరిగింది.
మార్క్ శంకర్ పేరుపైన... ఈ రోజున మధ్యాహ్నం భోజనం కూడా తిరుమల శ్రీవారి సన్నిధికి సంబంధించిన అధికారులు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక మధ్యాహ్న భోజనాన్ని తిరుమల శ్రీవారి భక్తులు... స్వీకరించ బోతున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న సాయంత్రం... తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజినోవ.
ఈ సందర్భంగా టిటిడి అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఆమె విదేశీ మహిళ, అందులోనూ క్రిస్టియన్ కావడంతో ప్రత్యేకంగా.. సంతకాలు కూడా చేయించుకున్నారు అధికారులు. అనంతరం మొక్కుబడి చెల్లింపులు భాగంగా.. తన తలనీలాలు సమర్పించుకున్నారు అన్నా లేజినోవ. ఇక ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజినోవ. ఇది ఇలా ఉండగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్పు శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సింగపూర్ లోని ఓ స్కూల్లో అన్ని ప్రమాదం జరగడంతో మార్గశంకర్కు తీవ్ర గాయాలయ్యాయి.