
సాధారణంగా పది మాసాల కాలంలో ఏ పార్టీలో అయినా.. అంతర్గత కుమ్ములాటలు సహజంగానే ఉంటా యి.. జనసేన కూడా దీనికి అతీతం కాదు. ముఖ్యంగా సీఎం సీటు విషయంలో పార్టీ నేతలు పట్టుబడుతు న్నారు. తమకే ఈ సీటు కావాలని కోరేవారు.. డిమాండ్ చేసేవారు కూడా ఉన్నారు. అయితే.. ఈ విషయం లో స్థిరమైన నిర్ణయంతో జనసేన ముందుకు సాగుతుండడం గమనార్హం. మరో 15 సంవత్సరాల పాటు టీడీపీకే జనసేన అధినేత మొగ్గు చూపుతున్నారు.
దీంతో అప్పటి వరకు ఉన్న లుకలుకలు డిమాండ్లు కూడా.. సైలెంట్ అయ్యాయి. అదే సమయంలో తీసుకుంటున్న నిర్ణయాలు కూడా.. సుస్థిరంగా ఉండడంతో పార్టీలో పెద్దగా వివాదాలు విభేదాలకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. వాస్తవానికి నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన కు అన్యాయం చేస్తున్నారన్న చర్చ కొన్నాళ్లుగా ఉంది. అయితే.. ఈ విషయాన్ని కూడా అంతర్గతంగా చర్చించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పరిష్కరించారు.
అదే సమయంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తు న్నారు. ఈ రెండు పరిణామాలు కూడా.. సుస్థిర నిర్ణయాలకు వేదికగా పార్టీని మార్చాయి. అంతేకాదు.. తన వ్యూహాన్ని పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు వరకు విస్తరించడం ద్వారా.. జనసేన భవితవ్యాన్ని ఆయన నిర్దేశిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం.. జాతీయ స్థాయిలో తన పలుకుబడిని పెంచుకోవడం ద్వారా.. జనసేన ఓ స్థిరమైన పార్టీ.. సుస్థిర నిర్ణయాల దిశగా సాగే పార్టీగా ప్రొజెక్టు చేయడంలో జనసేన దూకుడుగా ఉండడం గమనార్హం.