సాధారణంగా దేవాలయాలు అంటే ఏదైనా దూర ప్రాంతాలలో తవ్వుతున్నప్పుడు లేకపోతే నదితీర ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి.. అలాగే కొండలలో గుట్టలలో ఉండడం బయటపడడం, ఉండడం సర్వసాధారణంగా ఉంటుంది. కానీ ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా రైల్వే ట్రాక్ కింద అమ్మవారి ఆలయం ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో ఉండడం గమనార్హం. అయితే ఈ గుడిని తీసివేయడానికి చాలామంది ప్రయత్నించినప్పటికీ కొంచెం కూడా పక్కకి జరపలేకపోయారట. అంతటి శక్తి మహిమగల అమ్మవారు గురించి ఎప్పుడు పూర్తిగా మనం చూద్దాం.


తిరుపతి జిల్లాలో కరకంబాడి నుంచి రేణిగుంటకు నేషనల్ హైవే ఉన్నది. ఈ హైవే పక్కనే అమ్మవారి ఆలయం వెలిసినట్టుగా అక్కడి భక్తులు తెలియజేస్తున్నారు. సుమారుగా ఇది 70 ఏళ్ల క్రితం నాటి గుడి అని.. కరకంబాడి చెరువు కట్ట వద్ద ఉన్న పుట్టలో అమ్మవారు సైతం వెలిశారని అక్కడి భక్తులు తెలియజేస్తున్నారు. మొదట బ్రిటిష్ కాలంలో రైల్వే ట్రాక్ వేసే సమయంలో అమ్మవారి విగ్రహాన్ని కూడా పక్కకి జరపడానికి చాలా ప్రయత్నం చేశారట. దీంతో ఒక్కసారిగా అక్కడికి రైలు రాకపోకలు కూడా ఆగిపోయాయి. ఈ విగ్రహాన్ని జరపడానికి ప్రయత్నించిన బ్రిటిష్ వాళ్ళు కూడా అనారోగ్య పాలయ్యారట.


కట్టపుట్టలమ్మగా ఎన్నో ఏళ్లుగా భక్తుల నుంచి పూజలు అందుకుంటున్న ఈ అమ్మవారు గురించి ఇప్పటికి అక్కడి భక్తులు ఎన్నో కథలుగా చెబుతూ ఉంటారు.. రేణిగుంట సంతకు ఒకరోజు ఒక రైతు మిరియాల బండ్ల తో వెళుతూ ఉన్నప్పుడు అమ్మవారు వృద్ధురాలు రూపంలో కనిపించినట్లు తెలియజేశారు. ఆ సమయంలో బస్తాలో ఉన్నవి ఏంటి అని అమ్మవారు అడిగిందని వారు మిరియాలకు బదులుగా జొన్నలని చెప్పారట.. కానీ చివరికి సంతకు వెళ్లి రైతు చూస్తే ఆ వి నిజంగానే జొన్నలు గానే మారిపోయాయని.. ఈ అద్భుతం అమ్మవారి మహత్యం వల్లే జరిగిందని అక్కడి భక్తుల నమ్మకం. అయితే ఆ తర్వాత ఆమెను మొక్కడంతో జొన్నలు మిరియాలుగా మారాయట. దీంతో ఇక అమ్మవారి గుడిని ఏర్పాటు చేసి అక్కడ భక్తులు పూజలు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: