
ఇక అలాంటి సమయంలోనే ఆర్టీసీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదని ఉచిత బస్సులను కూడా కేవలం జిల్లాల పరిధిలోని ఉంచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఏపీ అంతట ఉచిత ప్రయాణం అంటే అసలు కుదరదు. ఉచిత బస్సు ప్రయాణానికి ఏకంగా 800 బస్సులను నడపనున్నారట. ఇందులో సిటీలకు ఎక్కువగా కేటాయించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నంనికి 100 బస్సులు కేటాయించబోతున్నారని అలాగే మెట్రో సిటీ విజయవాడకు కూడా 100 బస్సులు కేటాయిస్తున్నారట. ఆ తర్వాత గుంటూరు కి 100 నెల్లూరుకి 100 బస్సులు ఇవ్వబోతున్నారట.
ఆ తర్వాత మళ్లీ కర్నూలు, కాకినాడ ,అనంతపురం, రాజమండ్రి, కడప వంటి ప్రాంతాలకు 50 బస్సులను కేటాయించబోతున్నారట. అయితే జనాల ఎక్కువగా ఉండే చోట మాత్రమే బస్సులు నడిపించాలని నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకున్నది. ఈ విధంగా ఉచిత బస్సులను సైతం రోడ్ల మీదకి నడిపే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం. ఇతర రాష్ట్రాలలో ఉచిత బస్సుల హామీ పథకం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచే ఇచ్చినప్పటికీ ఏపీలో ఆర్థిక భారం ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా అందబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.