గత కొన్ని రోజుల నుంచి నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా  నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ గురించి వినిపిస్తున్నాయి. ఈడి ఈ కేసులో కీలక చర్యలకు పూనుకుంది. 2023 నవంబర్ లో జప్తు చేసినటువంటి అసోసియేటెడ్ జర్నల్స్  లిమిటెడ్ కు చెందినటువంటి రూ:661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. యంగ్ ఇండియా అనే సంస్థ ప్రియాంక, రాహుల్, సోనియా, మల్లికార్జున ఖా ర్గ్ వాళ్లకు అప్పిచ్చిందని తెలుస్తోంది. మొత్తం 90 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి కోట్ల రూపాయల విలువైనటువంటి నేషనల్ హెరాల్డ్ ఆస్తులను  వీళ్ళ కంట్రోల్ లో పెట్టుకొని నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని ఈడి నోటీసులు జారీ చేసింది. 

కేవలం నేషనల్ హెరాల్డే కాకుండా దానికి సంబంధించిన ఆస్తులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అప్పట్లో నేషనల్ హెరాల్డ్ కు కొంత మంది ఉచితంగా ఆస్తులు రాసిచ్చారు. వీటన్నింటినీ కలిపి నెలకు వస్తున్న అద్దే  దాదాపుగా 10 కోట్లకు పైగానే ఉంటుందట. డబ్బులు మొత్తం ఈ నలుగురు నాయకులు తింటున్నారని ఒక ఆరోపణ బయటకు వచ్చింది. మొత్తం లక్ష కోట్ల విలువైనటువంటి ఈ ప్రాపర్టీని కేవలం 90 లక్షలకే తీసుకున్నారని ఈడీ గమనించి నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించినటువంటి సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ ఇది కాంగ్రెస్ పార్టీ అంతానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

అసలు విషయంలోకి వెళితే నేషనల్ హెరాల్డ్ ఆస్తులు అనేవి దేశానికి సంబంధించిన ఆస్తి. కానీ అక్కడ నుంచి వచ్చిన అద్దె డబ్బులను వీరు సొంత అవసరాలకు వాడుకుంటున్నారు తప్ప ప్రజా అవసరాలకు కానీ, కాంగ్రెస్ పార్టీకీ కానీ ఎక్కడ వాడడం లేదని కొంతమంది మేధావులు ఆరోపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని డైవర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని ముంచే కుట్ర చేస్తున్నారని ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి వారి సింపతి పొందే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: