
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... కచ్చితంగా తెగించాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు జగన్మోహన్ రెడ్డి.
తాజాగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం... ఇటీవల ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ సవరణ చట్టం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును.. లోక్సభ అదే సమయంలో రాజ్యసభలో కూడా ఆమోదం అయ్యేలా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చాలా ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ.. సరైన బలం ఉండడంతో ఈ విషయంలో మోడీ ప్రభుత్వం సక్సెస్ అయింది. అయితే... మోడీ సర్కార్ తీసుకున్న ఈ బిల్లు విషయం నేపథ్యంలో చాలా పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ముస్లిం ఓటర్లు కలిగిన పార్టీలు... తమ గొంతును గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎక్కడ కూడా తగ్గడం లేదు ప్రతిపక్ష పార్టీలు. అయితే... తాజాగా ఈ విషయంలో వైసిపి పార్టీ కూడా ఒక అడుగు ముందుకు వేసింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి... ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ముస్లింలకు సంబంధించిన బిల్లును వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వం పై కేసు కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఈ పిటిషన్ కోర్టు పరిధిలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు... కేంద్రంలోని మోడీ సర్కార్ అనేక నిర్ణయాలు తీసుకుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి... ఇలా అస్సలు వ్యవహరించలేదు. ఒకవేళ కోర్టుకు వెళితే.. తనపై ఉన్న పాత కేసులను మోడీ ప్రభుత్వం బయటకు తీసే ప్రమాదం పొంచి ఉందని అప్పుడు జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఇప్పుడు తెగించారు జగన్మోహన్ రెడ్డి. జైలుకు వెళ్లిన పర్వాలేదు కానీ ముస్లిం ప్రజల కోసం పోరాడాలని సిద్ధమయ్యారు.