
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజకీయంగా తన పార్టీని పునాదుల స్థాయి నుంచి బలోపేతం చేసుకు వచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారా ? ఈ సారి కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకో బోతున్నారా ? అంటే అవుననే చర్చలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం వైసీపీ రాజకీయాలలో ఓ సంచలనం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఒకసారి పార్టీ నుంచి బయటికి వెళ్లిన పార్టీకి దూరంగా ఉన్న నాయకుల విషయంలో జగన్ ఎంత మాత్రం పట్టించుకోరు .. బుజ్జగింపు రాజకీయాలు కూడా చేయరు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది కాలంలో అనేకమంది నాయకులు బయటకు వెళ్ళిపోయిన .. ఒకరిద్దరు నాయకులతో తప్ప జగన్ సంప్రదించిందే లేదు .. వారిని పార్టీలో ఉండమని కోరింది కూడా లేదు. పెద్ద నాయకుల విషయంలో కూడా జగన్ చాలా లైట్ తీసుకున్నారు. అయితే తొలిసారి ఓ సంచలన విషయం వైసిపి లో చోటుచేసుకుంది.
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నానికి ఆదివారం వైసీపీ రాయబారం పంపినట్టు తెలుస్తుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాని గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వచ్చి వైసిపి కండువా కప్పుకుని విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన నానికి కృష్ణా జిల్లాలో మంచి పేరు ఉంది. గత ఎన్నికలలో వైసిపి నుంచి పోటీ చేసిన నాని సొంత తమ్ముడు కేసినేని చిన్ని చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తో పాటు .. సామాజిక సమీకరణలు .. అటు నానికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ నేపథ్యంలో నానిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు అయితే జగన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో కేసినేని నాని ఎలా స్పందిస్తారో చూడాలి.