వైసిపి పార్టీ నుంచి చాలామంది నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లడంతో పాటు కొంతమంది రాజకీయంగా కూడా దూరంగా ఉంటామంటు తెలియజేశారు. అలాంటి నేతలలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఒకరు.. తాడు రాజకీయాలు వదిలేసి మరి వ్యవసాయం చేస్తానంటూ తెలియజేశారు. అయితే గత ప్రభుత్ హయాంలో మద్యం కుంభకోణ విషయంలో తాజాగా విజయసాయిరెడ్డి విచారణకు రావాలి అంటు ఒక నోటీసును కూడా ఆంధ్రప్రదేశ్ అధికారులు జారీ చేశారు .వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరిగిందనే విధంగా పలువురు టిడిపి నేతలతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు భావిస్తోంది.


ఈ కేసులో ఏప్రిల్ 18వ తేదీన విజయవాడ లోని ఆఫీస్ కి వచ్చి విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులను జారీ చేశారు. ఇప్పటికే మద్యం కుంభకోణం పైన అధికారులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇళ్లతో పాటు పలు కార్యాలయాలలో నిన్నటి రోజున సోదా చేయడం జరిగిందట హైదరాబాదులో మూడు ప్రాంతాలలో ఏకంగా 50 మంది సీట్ అధికారులు ఈ విచారణ జరిపారని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి కి మూడుసార్లు అధికారులు నోటీసు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయినా కూడా ఆయన విచారణకు రాలేదట. ఆయన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు.


రాజశేఖర్ రెడ్డిని విచారిస్తే ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటు అధికారులు భావిస్తూ ఉన్నారు. గతంలో కూడా వైసిపి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరొక కేసులో విచారణ జరిపించగా అన్నిటికీ కూడా తాను సమాధానాలు అందిస్తానంటూ ప్రకటించడం జరిగింది. అందుకే ఈ రోజున అధికారులు విజయసాయి రెడ్డికి నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.ఈనెల 18వ తేదీన మరొక సారి విచారణ చేపట్టబోతున్నారు. మరి మద్యం కుంభకోణం విషయంలో ఏవైనా కీలకమైన విషయాలు చెబుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: