
ఈ నిర్ణయం ద్వారా ఏకంగా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పలుమార్లు టాటా సన్స్ చైర్మన్‌తో నారా లోకేశ్, చంద్రబాబు చర్చలు జరిపారు. సొంత క్యాంపస్ ఏర్పాటు కోసం టీసీఎస్ స్థలం కోరిన నేపథ్యంలో ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో అడుగు పెట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
విశాఖను ఐటీ హబ్ చేయడానికి ఉన్న ఏ అవకాశాన్ని కూడా బాబు సర్కార్ వదులుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం టీసీఎస్ కు స్థలం ఇవ్వడానికి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో గతంలో ఏ సంస్థకు ఇంత తక్కువ మొత్తానికి భూమి కేటాయించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో టాటా మోటార్స్‌కు చౌకగా స్థలం కేటాయించడం ద్వారా వార్తల్లో నిలిచారు.
విశాఖ టెక్ సిటీగా ఎదగడం కోసం కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతమేర సఫలమవుతాయో చూడాల్సి ఉంది. విశాఖలో అభివృద్ధి జరిగేలా భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలపై ప్రశంసలు వ్యక్తమవుతాయో విమర్శలు వ్యక్తమవుతాయో చూడాలి. అయితే మరీ 99 పైసలకే భూమిని ఇవ్వడం ఏంటనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మరిన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటయ్యే దిశగా అడుగులు వేసి నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.