
ఇందులో 1136 ఎన్జీటీలు, 1124 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలను విడుదల చేశారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ కోసం డీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఆటిజం సహ మానసిక వైఫల్యాన్ని కలిగినటువంటి విద్యార్థులకు సైతం విద్యను అందించేలా ఈ ప్రత్యేకమైన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబోతున్నారట. అలాగే ఎస్సీ వర్గీకరణ సంబంధించి 2025 మే 10వ తేదీ వరకు ఏక సభ్య కమిషన్ గడువును కూడా పెంచినట్లు ఏపీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేశారు.
వీటికి తోడుగా ఎస్సీ వర్గీకరణకు ఆర్డినేన్స్ కు క్యాబినెట్ కి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అలాగే హైకోర్టు అసెంబ్లీ భవన నిర్మాణానికి సైతం ప్రతిపాదనలో ఆమోదం పొందినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 617 కోట్ల రూపాయలు, 786 కోట్లతో భవనాలను నిర్మించబోతున్నారు.
హైదరాబాదులో ఐటి రంగాన్ని అభివృద్ధి చేసినట్లుగానే ఏపీలో కూడా చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రాజధానిని నిర్మాణం చేపట్టడానికి అందుకు సౌకర్యాలు కల్పించే విధంగా ఆమోదం తెలిపారు.
ఇక మత్స్యకారులకు ఇచ్చే సహాయాన్ని మరొక 10,000 అదనంగా పెంచినట్లు ఏపీ క్యాబినెట్ల తెలియజేశారు. మొత్తం మీద 20 వేల రూపాయలకు పెంచడం జరిగింది.
రాబోయే రోజుల్లో మరిన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తామంటూ మంత్రులతో పాటు సీఎం చంద్రబాబు కూడా తెలిపారు.