ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఇటీవలే గర్భిణీ అనూష హత్య కేసు ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ అంతట హాట్ టాపిక్ గా మారింది. రేపటి రోజున డెలివరీ అన్న సమయంలో ఈరోజు రాత్రి ఆమె మరణ వార్త ఒక్కసారిగా కుటుంబాన్ని కూడా ఆశ్చర్యపరచడం జరిగింది. అయితే ఈ కేసులో ఏసిపి సంచలన విషయాలు బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. భర్త జ్ఞానేశ్వర్, అనూష ఇద్దరూ కూడా ప్రేమించుకొని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారట. ఇక నిందితుడు హిందుస్థాన్ స్కాట్స్ అండ్ గైడ్ లో ఉద్యోగం చేస్తున్నారు.



పోలీసులు విచారణ లో తేలిన ప్రకారం పీఎం పాలెంలో గర్భిణీగా ఉన్న అనూష హత్య ఘటనలో పోలీస్ అధికారి అప్పలరాజు పలు సంచలన విషయాలు బయట పెట్టారు.. అనూషను వదిలించుకోవడానికి తన భర్త జ్ఞానేశ్వర్ గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూ ఉన్నారని పోలీసుల విచారణలో తేలిందట. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ ఎన్నో నాటకాలు ఆడారని ముందు తనకు క్యాన్సర్ ఉందని వేరే వివాహం చేసుకోమని అనూష పైన చాలా ఒత్తిడిని కూడా తీసుకువచ్చారట. అయితే అందుకు అనూష కూడా ఒప్పుకోకపోవడంతో జ్ఞానేశ్వర్ మరొక నాటకాన్ని ఆడారు.


తనకు వివాహమైనట్లు తల్లిదండ్రులకు అసలు తెలియదని వారికి తెలిస్తే ఇద్దరిని చంపేస్తారని అనూషను బెదిరించారు. అందుకే విడాకులు తీసుకోవాలని ఆమెకు ఒత్తిడి చేశారట. అయితే ఈ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించకపోవడంతో అనూషను గొంతు నిలిపి చంపినట్లుగా పోలీసులు తెలియజేశారు. జ్ఞానేశ్వర్ తన భార్యను బయటకు తీసుకువెళ్లి చాలా సరదాగా గడిపినట్లుగా కొన్ని రకాల ఫోటోలు కూడా దిగుదామని చెప్పిన కూడా వద్దనే వారిని స్నేహితుడు కూడా తెలిపారట. గతంలో ఎన్నోసార్లు తన భార్యను చంపడానికి  టాబ్లెట్లను కూడా ఉపయోగించారని .. కానీ ఆవేవి కూడా సక్సెస్ కాకపోవడంతో రాత్రికి రాత్రి అనూషను తన చున్నీతో చంపేశారని పోలీసులు తెలిపారు. అయితే జ్ఞానేశ్వర్ ముఖం పైన గోర్లతో బరికిన ఆడవాళ్లు కూడా ఉండడంతో అనూష స్నేహితురాలు పోలీసు విచారణ చేపట్టారని డిమాండ్ చేశారు. మంగళవారం రోజున డెలివరీ ఉండగా సోమవారం రాత్రి ఆమెను హతమార్చారు జ్ఞానేశ్వర్. చివరికి ఏమీ తెలియనట్లు పడుకొని ఉదయం బంధువులు లేపిన ఆమె లేకపోవడంతో పాటుగా జ్ఞానేశ్వర్ కూడా ఆమెను నిద్ర లేపుతున్నట్లు నటించారు.. పోలీస్ అధికారులు విచారించగా.. చివరికి తన భార్యను తానే చంపానని జ్ఞానేశ్వర్ ఒప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: