జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ ఆంటోనికి సింగపూర్ లో గాయాలైన సంగతి తెలిసిందే. సింగపూర్ స్కూల్ లో ఏప్రిల్ నెల 8వ తేదీన ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయాలపాలైన మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ తో పాటు మరి కొందరు చిన్నారులను కాపాడింది భారతీయ వలస కార్మికులు కావడం గమనార్హం.
 
సింగపూర్ సర్కార్ ఆ కార్మికులను సత్కరించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. లైఫ్ సేవర్ అవార్డును ప్రధానం చేసినట్టు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ పేర్కొంది. ఈ ప్రమాదం గురించి కార్మికులు మాట్లాడుతూ మేము చూసేసరికి గదిలో పిల్లలు భయంతో వణుకుతూ అరుస్తూ కనిపించారని చెప్పుకొచ్చారు. మూడో అంతస్తు నుంచి కొంతమంది పిల్లలు దూకేయాలని చూశారని వాళ్లు చెప్పుకొచ్చారు.
 
మేము ఆ పిల్లలతో మాట్లాడి వాళ్లు దూకకుండా చూశామని వలస కార్మికులు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వారిని కిందికి తీసుకొచ్చామని భారతీయ వలస కార్మికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి ప్రాణాలను కోల్పోయిందని ఆ చిన్నారిని కాపాడలేకపోయామనే బాధ మాత్రం తమలో ఉందని వాళ్లు పేర్కొన్నారు. సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ సమీపంలో ఉన్న భవనంలో ఈ ప్రమాదం సంభవించింది.
 
మొత్తం 15 నుంచి 20 మంది పిల్లలు ఈ ప్రమాదంలో గాయాల పాలైనట్టు తెలుస్తోంది. గాయాలపాలైన పిల్లలు ఉన్న స్కూల్ దగ్గరే వలస కార్మికులు పని చేస్తున్నారని తెలుస్తోంది. వలస కార్మికులు ఆలస్యం చేయకుండా సహాయక చర్యలకు దిగడం వల్ల భవనంలో చిక్కుకున్న పిల్లలు క్షేమంగా బయటపడ్డారని చెప్పవచ్చు. పవన్ కొడుకు పూర్తిస్థాయిలో కోలుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ద్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా రాబోయే రోజుల్లో పవన్ ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: