
ఏపీలో కూడా మంత్రివర్గ సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయం అయినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందట. క్యాబినెట్ బేటిలో క్లాస్ స్పీకర్ మంత్రులకి టిడిపి గోశాల వదంతం పైన కూడా వక్ఫ చట్ట సవరణ పైన కూడా , పాస్టర్ ప్రవీణ్ మూర్తి పైన ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తూ ఉంటే మీరు ఎవరు కూడా స్పందించలేదు.. మతపరమైన అంశాలను ప్రతిపక్ష ఆరోపణలకు సైతం మంత్రులు ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారనే విధంగా చంద్రబాబు నాయుడు మంత్రులను క్లాస్ పీకారని వినిపిస్తున్నాయి.
ఇలాంటి అంశాల పైన కచ్చితంగా మంత్రులు వెంటనే స్పందించాలని కూడా తెలిపారు.. ఆ తర్వాత వెంటనే హోమ్ మినిస్టర్ అనిత కూడా రంగ ప్రవేశం చేసి అర్జెంటుగా దానిమీద మాట్లాడడం జరిగింది.. అలాగే ఏదైతే గోశాలో జరిగినటువంటి విషయం పైన అదంతా ఫేక్ ప్రచారం అంటూ తెలిపింది అనిత.. అలాగే మత ఉద్రిక్తతలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారనే విషయం గురించి మాట్లాడుతూ.. వైసిపి పార్టీనే పాస్టర్ ప్రవీణ్ ఉదాంతాన్ని రెచ్చగొడుతున్నారని, అలాగే వక్ఫ్ చట్టానికి సంబంధించి ప్రజలని మోసం చేస్తోంది వైసీపీ నే అంటు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక మీదట ప్రతిపక్ష పార్టీలు ఏదైనా విషయం పైన మాట్లాడితే కచ్చితంగా దీటుగా సమాధానం చెప్పాలంటు క్లాస్ పీకారట సీఎం చంద్రబాబు.