
ఈ విషయం విన్న తర్వాత రైతులకు కూడా రగిలిపోతున్నారు. ముందుగా తమ సంగతి తేల్చకుండానే అమరావతి నిర్మాణం పూర్తి చేసేదాకా కూడా ఇతర ప్రయత్నాలు మానుకోవాలి అంటూ కూడా హెచ్చరిస్తున్నారట. అమరావతి ప్రాంత రైతులకు సైతం భూములు తీసుకుంటున్న సమయంలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట.పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన వెంటనే రాజధానిలో వీరికి రిటర్నబుల్ ఫ్లాట్ కేటాయిస్తామని.. మీ భూముల కంటే అప్పటికి ఆ ఫ్లాట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారట.
దీనివల్ల భూములు పోగొట్టుకున్న రైతులు కూడా లాభపడతారని చెప్పి ఆ మాటలు నమ్మి రైతులు భూములు ఇచ్చామని తెలియజేస్తున్నారు. అయితే ఆ తర్వాత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండకూడదని దీనిని శాసన రాజధానిగా మార్చి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ చేయాలని చూశారు. దీంతో రైతులకు కూడా కోర్టుకు వెళ్లి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 11 నెలలు ఒక వస్తువు ఉన్న అమరావతి గురించి ఏమి చెప్పకుండా మిగిలిన 44 వేల ఎకరాల భూమిని కావాలంటూ ఉండడంతో రైతుల సైతం మండిపడుతున్నారు. గతంలో అమరావతి రైతులు చంద్రబాబు చెప్పినట్టుగా ఆడినప్పటికీ ఇప్పుడు వారే తిరగబడుతున్నారు.