
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం... ఆరు గ్యారంటీలను అటకెక్కించిందని గాలికి వదిలేసిందని అక్కడి ప్రజలు... తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. అంతకుముందు కర్ణాటక రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. అన్ని శాఖల్లో విపరీతంగా కమిషన్లు దండుకున్న నేపథ్యంలో... బిజెపిని కాదని కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు కర్ణాటక ప్రజలు. అయితే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రం లోతరహాలోనే కర్ణాటకలో కూడా హామీలు ఇచ్చి... అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే... బడ్జెట్ సరిపోవటం లేదని అనేక సాకులు చూపిస్తోంది కాంగ్రెస్. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఉచిత బస్సు అన్నారు ఆ తర్వాత చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అలాగే మెట్రో ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగాయి. కర్ణాటక రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు అడ్డదిడ్డంగా పెరిగిపోయాయని చెబుతున్నారు.
అసలు ఎన్నికల కంటే ముందు ప్రకటించిన 6 గ్యారంటీలు... ఎక్కడ కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కర్ణాటక ప్రజలు. అయితే ఇలాంటి నేపథ్యంలో... ఈ ఆరు గ్యారెంటీల టాపిక్ డైవర్ట్ అయ్యేలా కుల రాజకీయానికి తెర లేపారు అక్కడి నేతలు. ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని కొత్త నినాదాలు.. తీసుకువస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని ఓబీసీలకు 31 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వాటిని 52 శాతానికి పెంచుతామని.. దానికోసం కులగనన చేస్తామంటూ కొత్త బాంబు పేల్చారు.
అలాగే ముస్లింలకు నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు 8 శాతానికి పెంచుతామని కూడా చెబు తున్నారు. అయితే ఇప్పుడు ఈ కొత్త కుల గణన తెరపైకి తీసుకురావడంతో రాజకీయాలు ఒకసారిగా మారిపోయాయి. ఓబీసీలు అంతా ఏకమై... త మ రిజర్వేషన్లకు పోరాడే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బిజెపి పోరాటం చేసేందుకు రంగం సి ద్ధం చేసింది.