అమరావతి పట్టణం లో రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన కొలువుదీరే టవర్ల నిర్మాణానికి CRDA తాజాగా టెండర్లు పిలిచింది. సమీకృత రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు కూడా ఈ టెండర్ లోనే రానున్నాయి. మొత్తంగా ఐదు టవర్లను మూడు ప్యాకేజీల కింద విభజించారు. ఈ ఐదు టవర్ల నిర్మాణానికి దాదాపు 4688.82 కోట్ల అంచనా వ్యయంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. మే 1 వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఈ బిడ్లనూ వేసేందుకు అనుమతులను కూడా జారీ చేసింది.

ఇక అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు సాంకేతిక బిట్లను కూడా తెరవనున్నారు.  ఇక గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఐకానిక్ టవర్ల నిర్మాణం కోసం 2703 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను పిలిచారు. కానీ ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి వైసిపి పార్టీ అధికారం లోకి రావడం మూడు రాజధానుల ప్రతిపాదనలో తెర పైకి తెలపడంతో ఆ అంచనా వ్యయం దాదాపు 73 శాతం వరకు పెరిగింది.

పోస్టర్స్ సంస్థ డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్ల ఆకృతలను రూపొందించింది. GAD టవర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మించబోతున్నారు. ఇక ఇందు లోనే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా రానుంది. సీ ఎం ప్రయాణాల కోసం ఎలిప్యాడ్ సౌకర్యం ఉండే విధంగా భవనాన్ని నిర్మించబోతున్నారు. ఇక HOD టవర్లను 39 అంతస్తుల చొప్పున ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ఇక ఐకానిక్ టవర్లు నిర్మాణాన్ని మొత్తంగా 68.88 లక్షల చదరపు అడుగుల్లో చేస్తున్నారు. ఇలా అత్యాధునితమైన టెక్నాలజీ తో భారీ వ్యయంతో అమరావతి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన సచివాలయాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సచివాలయాన్ని అద్భుతంగా నిర్మించడం కోసం ప్రస్తుత కూటమి ప్రభుత్వం చాలా చిత్త శుద్ధి వహించబోతున్నట్లు కూడా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: